బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోళ్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

by Anukaran |   ( Updated:2021-03-03 10:47:42.0  )
బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోళ్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కొనుగోలు చేయాలని నిర్ణచించింది. కొత్తగా10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోళ్లకు ఏపీ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. దీని కోసం రూ. 6.75 కోట్లు కేటాయించారు. వీటిలో రూ. 65 లక్షల విలువైన 5 స్కార్పియో వాహనాలు.. రూ. 70 లక్షల విలువైన 5 టాటా హెక్సాలు కొనుగోలు చేయనున్నారు. ఈ కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ముఖ్యమంత్రి, మంత్రులు, పోలీసు ఉన్నతాధికారుల భద్రత కోసం వినియోగించనున్నట్టు ప్రభుత్వం చెప్తోంది. ప్రస్తుతం ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పలువురు మంత్రులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మంత్రుల సూచనలు, పోలీసు ఉన్నతాధికారుల సలహాలతో కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed