అక్కడి ప్రభుత్వ కార్యాలయాలు అప్పటి వరకే..

by srinivas |   ( Updated:2021-05-07 05:48:31.0  )
అక్కడి ప్రభుత్వ కార్యాలయాలు అప్పటి వరకే..
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేసింది. ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని తెలిపింది. 12 గంటల తర్వాత కార్యాలయాలు నిర్వహించాలంటే తప్పనిసరిగా పాసులు తీసుకోవాలని సూచించింది. అత్యవసర సర్వీసులకు ఈ నిబంధనల నుంచి మినహాయింపులు ఉంటాయని పేర్కొంది.

Advertisement

Next Story