- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పుడు 'దోమలపై దండయాత్ర' ఇప్పుడు కుక్కలపై దండయాత్ర
దిశ, వెబ్ డెస్క్ : కుక్కల బెడద, పందుల నుంచి వచ్చే వైరస్ లను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుక్కలతో పాటు, పందులకు లైసెన్స్ తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాయాంలో ‘దోమలపై దండయాత్ర’ జరిగింది. నాడు అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో రాష్ట్రంలో కుక్కల దాడుల గురించి నాటి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ ప్రస్తావించారు. విశాఖతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కుక్కల బెడద పెరిగిందని, టీడీపీ ప్రభుత్వం చేస్తున్న దోమలపై దండయాత్ర తో పాటు కుక్కల పై దండయాత్ర చేస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరారు.
ఎమ్మెల్యే, ఎంపీల ఇళ్లకు కుక్కలు రాకపోవచ్చు. కానీ నాతో సహా, సామాన్యుల్ని వెంటపడి కరుస్తున్నాయి. మరి క్రూరంగా ప్రవర్తిస్తున్నాయని చమత్కిరిస్తూ బీజేపీ నేత విష్ణుకుమార్ చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో నవ్వులు పూయించాయి. అయితే గత ప్రభుత్వం కుక్కల గురించి పట్టించుకోకపోయినా.., ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కుక్కలు, పందులపై కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో కుక్కలకు, పందులకు లైసెన్స్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లైసెన్స్ లేని కుక్కలను, పందులను అధికారులు పట్టుకుంటే రూ.500 ఫైన్ తోపాటు రోజుకు రూ.250 అపరాద రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఏ.పి. పంచాయతీ అండ్ రూరల్ డెవలప్ మెంట్ శాఖ తెలిపింది. ఇక అధికారులు పట్టుకున్న పందులు, కుక్కలకు యజమానులు లేకపోతే వాటిని వీది కుక్కలుగా పరిగణించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయనున్నారు. కుక్కలు, పందులకు లైసెన్స్ ముగిసిపోతే… తిరిగి 10 రోజుల్లోగా లైసెన్స్ ను రెన్యువల్ చేసుకోవాలి . కుక్కలకు హెల్త్ సర్టిఫికేట్, పందులకు వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ తప్పనిసరి తెలిపిన ప్రభుత్వం కుక్కలకు, పందులకు లైసెన్స్ తప్పనిసరి చేస్తు జీ.వో నంబరు 693ని విడుదల చేసింది.