కేంద్ర బలగాలతో నాకు రక్షణ కల్పించండి

by srinivas |
కేంద్ర బలగాలతో నాకు రక్షణ కల్పించండి
X

తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కేంద్రాన్ని కోరారు. బుధవారం ఈ మేరకు కేంద్ర హోం సెక్రెటరీకి ఆయన లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు, కుటుంబ సభ్యులకు పలువురి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మీడియాకు వెల్లడించారు. అయితే ఈసీ రాసిన లేఖపై కేంద్ర హోం సెక్రెటరీ ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాలి. ఇదిలా ఉండగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, పలు జిల్లాలకు చెందిన అధికారులను ఆయన బదిలీ చేయడంపై సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా ఎన్నికల వాయిదా అంశంపై నిర్ణయాధికారం పూర్తిగా ఎన్నికల సంఘానిదే అని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.

Tags: ap election comisioner ramesh kumar, letter to central home secretory, para forces, protection

Advertisement
Next Story

Most Viewed