- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల
దిశ, వెబ్డెస్క్: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను మంత్రి ఆదిమూలుపు సురేష్ విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 84.78 శాతం ఉత్తీర్ణత సాధించగా.. అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో 91.77 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల ప్రవేశానికి గత నెలలో పరీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,56,953 మంది విద్యార్థులు హాజరుకాగా, 1,33,66 మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 75,858మంది విద్యార్థులు హజరవ్వగా.. 69,616 మంది అర్హత సాధించారు. కరోనా కారణంగా హాజరుకాలేకపోయిన 97 మంది అభ్యర్థులకు ఈ నెల 7వ తేదీన పరీక్ష నిర్వహించారు.
ఇంజనీరింగ్ విభాగంలో విశాఖకు చెందిన వావిలపల్లి సాయినాథ్ మొదటి ర్యాంక్ లో సాధించారు. హైదరాబాద్ కు చెందిన కుమార్ సత్యం రెండో ర్యాంక్.. ప్రొద్దుటూరుకు చెందిన గంగుల భువన్ రెడ్డి మూడో ర్యాంకులో ఉన్నారు. ఇక అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో తెనాలికి చెందిన చైతన్య సింధు మొదటిస్థానంలో నిలిచారు.