సీఎం జగన్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు.. చంద్రబాబుకు ధర్మాన వార్నింగ్

by srinivas |   ( Updated:2021-08-25 04:29:37.0  )
AP Deputy CM Dharmana Krishnadas
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లపై ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పైనా, వైసీపీ ప్రభుత్వంపైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని హితవు పలికారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారని చెప్పుకొచ్చారు. బుధవారం ఏపి మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా హేమమాలిని రెడ్డి బాధ్యతల స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ జగన్ మహిళా పక్షపాతిగా ఉన్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తామని సీఎం జగన్ చెప్పుకొచ్చారని ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగమే మద్యాన్ని ముట్టకుంటే షాక్ కొట్టేలా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇకనైనా చంద్రబాబు, లోకేశ్‌లు సద్వివిమర్శలు చేస్తే మంచిదని మంత్రి ధర్మాన కృష్ణదాస్ హితవు పలికారు.

Advertisement

Next Story