తెలంగాణ పోలీసులకు మానవత్వం లేదు.. ఏపీ సీపీఐ నేత ఫైర్

by srinivas |
CPI Leader Ramakrishna
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంబులెన్సులను తెలంగాణ సరిహద్దుల్లో ఆపడం మూలంగానే అనేకమంది కరోనా బాధితులు మరణించారని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృకష్ణ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా బాధితులు మృతికి తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్తున్న అంబులెన్సులను అడ్డుకోవడం దుర్మార్గం అని మండిపడ్డారు. కరోనా పేషెంట్ల పట్ల తెలంగాణ పోలీసులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story