- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ సీఎం ఓ ట్రెండ్ సెట్టర్: మేకపాటి
అమరావతి: సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజులోనే సుమారు 50లక్షల మంది లబ్దిదారులకు పింఛన్లు అందజేసి ట్రెండ్‌సెట్ చేసిందని పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రశంసించారు. పింఛన్ల పంపిణీలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 3వ స్థానంలో నిలిచేలా సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు వ్యక్తం చేశారు. గంటల తరబడి వరుసలో నిలబడినా.. వస్తుందో రాదో తెలియక ఆందోళన చెందే పద్ధతికి స్వస్థి పలికి, సరాసరి లబ్దిదారుల చెంతకే పింఛన్లు అందిస్తున్న ప్రభుత్వాన్ని వృద్ధులు ఆశీర్వదిస్తున్నారని కొనియాడారు. నెల్లూరు జిల్లాలో తొలిరోజే 90 శాతం మందికి పింఛన్లు అందించడంపై వాలంటీర్లు, జిల్లా యంత్రాంగానికి మేకపాటి అభినందనలు తెలిపారు. అలాగే, ఒక్క రోజులో పక్కాగా పింఛన్లు అందించడంలో భాగస్వామ్యమైన వాలంటీర్లు, అధికారులు, గ్రామసచివాలయ సిబ్బందిపై ప్రశంసల జల్లు కురిపించారు.