- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ?
కాంట్రాక్టు కార్మికుల వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోంది. ఏపీలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్నారు. వారంతా తమను క్రమబద్దీకరించాలంటూ ప్రభుత్వాన్ని అర్ధిస్తున్నారు. అయితే ఈ అంశంపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏపీపీఎస్సీ ద్వారా కొన్ని విభాగాల్లో ఖాళీలు భర్తీ చేస్తున్నప్పటికీ. సచివాలయంతో సహా వివిధ విభాగాల్లో ఖాళీలు భర్తీ కాలేదని, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సేవలకు సరిపడా ఉద్యోగులు లేరన్న ఆరోపణలు సుదీర్ఘ కాలంగా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధ్యక్షతన ఏర్పాటైన వర్కింగ్ కమిటీ సమావేశమైంది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు గతంలో ప్రభుత్వం జీఓఎం(గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ను ఏర్పాటు)ను ఏర్పాటు చేసింది. ఈ జీవోఎంకి సీఎస్ ఆథ్వర్యంలో ఏర్పాటైన వర్కింగ్ కమిటీ వచ్చే మార్చి 31లోగా నివేదిక అందించాల్సి ఉంది. ఈ క్రమంలో సమావేశమైన కమిటీ అసలు ప్రభుత్వంతో అనుభంధంగా పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులెంతమంది? శాఖల వారీగా వారి వివరాలేంటి? గుర్తించి, నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆయా శాఖల అధికారులను ఎలా సమన్వయం చేసుకోవాలి? వారితో నివేదికలు ఎంత త్వరగా తెప్పించుకోవాలి వంటి విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్.. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను నంబరు స్టేట్ మెంట్ల ప్రకారం కొంత వరకూ గుర్తించడం జరిగిందన్నారు.. వారితో పాటు అదనంగా ఇంకెవరైనా పని చేస్తున్నారా? వారేనా వంటి పూర్తి వివరాలను ఆయా శాఖాధిపతులు నిర్ధారించి ఇవ్వాల్సి ఉంటుందని వివరించి, ఈ మేరకు ఉన్నతాధికారులకు అదేశాలు జారీ చేశారు.