బీజేపీ పటిష్టతకు కృషి చేస్తా: సోము వీర్రాజు

by srinivas |
బీజేపీ పటిష్టతకు కృషి చేస్తా: సోము వీర్రాజు
X

దిశ ఏపీ బ్యూరో: ఏపీలో బీజేపీ పటిష్టతకు కృషి చేస్తానని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పార్టీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, బాధ్యతలనేవి పార్టీ నిర్ణయించే అంశాలన్న ఆయన, అందరి సమన్వయంతో పార్టీని విజయవంతంగా ముందుకు నడిపిస్తానని తెలిపారు.

ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతామని అన్నారు. చంద్రబాబు ప్రవర్తన మూలంగానే టీడీపీ ఓడిపోయిందని ఆయన స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరతామని ఆయన చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకి అవసరమైన నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. ఏపీ అభివృద్ధిలో బీజేపీ పాత్ర తప్పకుండా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story