రైతుల కోసమే కొత్త చట్టాలు : సోము వీర్రాజు

by srinivas |   ( Updated:2020-12-27 03:11:37.0  )
రైతుల కోసమే కొత్త చట్టాలు : సోము వీర్రాజు
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు గుంటూరులో ప్రసంగించారు. రైతుల కోసమే ప్రధాని మోడీ నూతన వ్యవసాయ చట్టాలను తెచ్చారని చెప్పారు.ఈ చట్టాల ద్వారా రైతులకు రెట్టింపు ఆదాయం వస్తుందని వెల్లడించారు. కొత్త చట్టాల ద్వారా బ్లాక్ మార్కెట్ మూసుకుపోయిందని, అందువల్లే కొందరు ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు.

రైతులకు కల్తీ యూరియా అవకాశం లేకుండా వేప పూత యూరియా తీసుకొచ్చామన్నారు.కేంద్రం విధానాలపై కొన్ని రాష్ట్రాలకు రుచి, సుచి లేదన్నారు. నీరు, మీరు అంటూ కోట్లు వెచ్చించారని, అలా కాకుండా అందరూ రైతుచట్టాలను స్వాగతించాలని సోము వీర్రాజు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story