పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం

by Anukaran |
పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
X

దిశ, వెబ్‎డెస్క్: పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు సభ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీనిపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బిల్లుపై మళ్లీ చర్చించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై సీఎం జగన్ వివరణ ఇస్తూ.. ఈ బిల్లుపై ఇంతకుముందే అసెంబ్లీ సమగ్ర చర్చ జరిగిందని, ఇక్కడ నుంచి మండలికి పంపించారని సీఎం తెలిపారు. వినూత్నమైన పద్ధతిలో పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లు తీసుకొచ్చామని వివరించారు. ఎన్నికల్లో డబ్బుల ప్రభావం ఉండకూడదనే చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చామని సీఎం జగన్ వెల్లడించారు. ఎన్నికల అనంతరం కూడా తప్పు చేసిన వారిపై చర్యలకు చట్ట సవరణతో ఆస్కారం ఉంటుందని స్పష్టం చేశారు.

ఇక బీఏసీ సమావేశంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడుపై సీఎం జగన్ సెటైర్లు విసిరారు. టీడీపీ కోరినట్టే వ్యవసాయంపై చర్చిద్దామని సీఎం జగన్ స్పష్టం చేశారు. టెలిపతీ వల్ల టీడీపీ అనుకుంది ముందే తెలిసిపోయిందన్నారు. ఎస్సీ, ఎస్టీల దాడులపై చర్చించాలని అచ్చెన్నాయుడు కోరారు. తమ ఎంపీ నరేష్ పై టీడీపీ దాడి చేసింది దానికోసమేనా అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. దళిత మహిళలపై మీరు దాడి చేసింది మర్చిపోయారా అంటూ నిలదీశారు.

Advertisement

Next Story

Most Viewed