- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మృతదేహంతో ప్రియుడి ఇంటి ముందు ఆందోళన
దిశ, సత్తుపల్లి : పెళ్లికి నిరాకరించిన ప్రియుడి ఇంటి ఎదుట ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలి మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టిన ఘటన మంగళవారం మండల పరిధిలోని తుమ్మూరు లో చోటుచేసుకుంది. సత్తుపల్లి పట్టణానికి చెందిన ప్రత్యూష(20) అనే యువతి పెయింటింగ్ వర్క్ చేసే తుమ్మూరు గ్రామానికి చెందిన బండి జగదీష్‌లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమించిన జగదీష్ పెళ్లికి నిరాకరించడంతో పాటు మరో అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు తెలిసి మనస్థాపానికి గురైన ప్రత్యూష హైదరాబాదులో తన నివాసంలో గత నెల 30వ తేదీన సూసైడ్ నోట్ రాసి, శానిటైజర్ తాగి ఆత్మహత్యయత్నం చేసింది.
గమనించిన మిత్రులు స్థానిక వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహించగా సోమవారం మృతి చెందింది. దీంతో తన కుమార్తె మరణానికి జగదీష్ కారణమంటూ ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు జగదీష్ ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమింపజేశారు.