తెలుసు కానీ తప్పటం లేదు.. కోహ్లీపై అనుష్క శర్మ కామెంట్..

by Shyam |   ( Updated:2021-11-05 04:54:40.0  )
తెలుసు కానీ తప్పటం లేదు.. కోహ్లీపై అనుష్క శర్మ కామెంట్..
X

దిశ, సినిమా : రన్ మెషిన్, టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ తన బ్యాటింగ్‌ స్కిల్స్‌తో వరల్డ్ క్లాస్ ప్లేయర్‌గా ఎదిగాడు. ఫార్మాట్ ఏదైనా పరిస్థితులకు తగ్గట్టు తనను తాను మార్చుకునే విరాట్.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన పట్ల విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇదిలా ఉంటే.. నేడు తన బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్, సహచర ఆటగాళ్ల నుంచి సోషల్ మీడియాలో విషెస్ అందుకున్న కోహ్లీకి.. ఆయన వైఫ్ అనుష్క శర్మ స్పెషల్‌గా శుభాకాంక్షలు తెలిపింది. యూఏఈలో దివాళీ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన పిక్ షేర్ చేస్తూ కోహ్లీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

‘మనం ఇలా సోషల్ మీడియా ద్వారా మాట్లాడుకునేవాళ్లం కాదని తెలుసు. కానీ నువ్వు నిజంగా ఎంత అద్భుతమైన వ్యక్తివో కొన్నిసార్లు కేకలు వేస్తూ ఈ ప్రపంచానికి చెప్పాలనుకుంటాను. నీ జీవితాన్ని నడిపించేందుకు ప్రత్యేకంగా సాధన చేయాల్సిన అవసరం లేదు. ధైర్యం, నిజాయితీ కలగలిపిన నీ ఆశయాలు చాలా బలమైనవి. నిర్భయంగా, పట్టుదలతో, ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా చీకటి జీవితాన్ని గెలవడంలో నీకు ఎవరూ సాటి లేరని నాకు తెలుసు. ప్రతి విషయాన్ని మరింత అందంగా చేసినందుకు లవ్ యూ, హ్యపీ బర్త్‌డే టూ యు’ అంటూ అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కాగా విరాట్‌పై గల నమ్మకానికి, ప్రేమకు ఫిదా అవుతున్న నెటిజన్లు.. ప్రేమకు మీ జంటే ఉదాహరణ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story