- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిరాశ్రయులకు విరుష్క హెల్ప్
ఓ వైపు కరోనా మహమ్మారి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే, మరో వైపు దేశంలో వరదలు ముంచెత్తడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. అస్సాం, బీహార్‌లో సంభవించిన వరదల కారణంగా లక్షలాది మంది కూడు, గూడు లేక తల్లడిల్లుతున్నారు. సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ పరిస్థితిని గమనించిన బాలీవుడ్ హీరోయిన్, ప్రొడ్యూసర్ అనుష్క శర్మ తన భర్త విరాట్ కోహ్లీతో కలిసి విరాళం అందిస్తున్నట్లు ప్రకటించింది. అస్సాం, బీహార్‌లో వరదలు కొన్ని లక్షల జీవితాలను, జీవన వ్యవస్థను అతలాకుతలం చేశాయని.. వారిని ఆదుకునే బాధ్యత తీసుకోవాలని కోరింది. భర్త విరాట్‌తో కలిసి తమ వంతు సహాయం అందిస్తున్నామన్న అనుష్క.. మీరు కూడా ముందుకు రావాలని అభిమానులు, సోషల్ మీడియా ఫాలోవర్స్‌ను కోరింది. మూడు ఆర్గనైజేషన్స్ చాలా బాగా పనిచేస్తున్నాయని.. యాక్షన్ అయిడ్ ఇండియా, రాపిడ్ రెస్పాన్స్, గూంజ్ సంస్థల వివరాలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
View this post on Instagram
A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on Jul 29, 2020 at 10:30pm PDT
కాగా ఇప్పటికే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, భర్త నిక్ జోనస్ కలిసి అస్సాంకు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. బాధితులకు అండగా ఉందామని, ప్రతీ ఒక్కరూ సహాయం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.