- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీరాబాయి చాను ఇయర్ రింగ్స్ స్టోరీ.. లవ్‌లో పడ్డ అనుష్క
దిశ, సినిమా : టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మొదటి పతకాన్ని సాధించి పెట్టిన అథ్లెట్ మీరాబాయి చాను ఇయర్ రింగ్స్‌తో లవ్‌లో పడిపోయింది హీరోయిన్ అనుష్కశర్మ. మీరాబాయి బిగ్ అచీవ్‌మెంట్ అనంతరం సోషల్ మీడియా తనపై ప్రశంసల వర్షం కురిపించగా.. ఆమె పెట్టుకున్న ఇయర్ రింగ్స్‌పై స్పెషల్ అటెన్షన్ వచ్చేసింది. తన తల్లి బహుమతిగా ఇచ్చిన ఒలంపిక్స్ రింగ్ షేప్‌డ్ స్ట్రట్స్ ధరించి పార్టిసిపేట్ చేయగా.. తల్లి ప్రేమే తనను విజేతగా నిలబెట్టిందని కొనియాడారు.
కాగా దీనిపై ఓ చానల్ ఇంటర్వ్యూలో స్పందించిన మీరా తల్లి.. ‘టీవీలో తను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ చూసి సంతోషపడ్డాను. 2016 రియో ఒలంపిక్స్‌కు ముందు వాటిని గిఫ్ట్‌గా ఇచ్చాను. వాటిని నా సేవింగ్ మనీ, పాత నగలుతో కలిపి చేయించాను. మీరా తన హార్డ్ వర్క్‌తో సక్సెస్ సాధించడం ఆనందంగా ఉంది’ అని తెలిపింది.
కాగా ఈ విషయంపై స్పెషల్ మెన్షన్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టిన హీరోయిన్ అనుష్క.. మీరాబాయి చాను ఇయర్ రింగ్స్ స్టోరీ అద్భుతంగా అనిపించిందని, ప్రస్తుతం దేశం గర్వించే విజయాన్ని సొంతం చేసుకునేందుకు కారణం మీరా అమ్మ ఇచ్చిన బహుమతే అని సంతోషం వ్యక్తం చేసింది.