మహాసముద్రంలో ‘అను’ ప్రయాణం..

by Anukaran |   ( Updated:2020-10-19 01:30:40.0  )
మహాసముద్రంలో ‘అను’ ప్రయాణం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ‘మహాసముద్రం’ సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. అజయ్ భూపతి డైరెక్షన్‌లో వస్తున్న మల్టీ స్టారర్ సినిమాలో మల్టీ టాలెంటెడ్ స్టార్స్‌ను ఎంచుకోడమే ఇందుకు కారణం. యంగ్ హీరో శర్వానంద్ ఈ సినిమాలో లవర్ బాయ్ సిద్దార్థ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండగా.. హైదరాబాదీ గర్ల్ అదితి రావు హైదరీ ఫిమేల్ లీడ్ చేస్తున్న విషయం తెలిసిందే. అజయ్ చెప్పిన బౌండెడ్ స్క్రిప్ట్‌కు ఫిదా అయిన అదితి.. ఈ సినిమాలో భాగస్వామ్యం అయ్యేందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నానని తెలిపింది.

కాగా, మహాసముద్రం నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ లేటెస్ట్‌గా మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది. నిర్మాత అనిల్ సుంకర పరబ్రహ్మం పుట్టినరోజును పురస్కరించుకుని.. ఈ సర్‌ప్రైజ్ ఇస్తూ మరో హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయెల్‌ను సెలెక్ట్ చేసినట్లు ప్రకటించారు. సెకండ్ లీడ్ హీరోయిన్‌గా టీమ్‌తో జాయిన అయిన అను.. సిగ్నిఫికెంట్ రోల్ చేస్తుండగా, ఆమె క్యారెక్టర్‌ను డైరెక్టర్ అజయ్ భూపతి చాలా ఇంట్రెస్టింగ్‌గా డిజైన్ చేశారని టాక్.

Advertisement

Next Story

Most Viewed