ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టే ‘యాంటీ వైరస్’

by Jakkula Samataha |
ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టే ‘యాంటీ వైరస్’
X

దిశ, వెబ్‌డెస్క్: ‘యాంటీ వైరస్’.. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిన చిత్రం. రాజ్ కుమార్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని తెలిపారు.

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితికి అద్దం పట్టేలా సినిమా ఉంటుందన్న హీరో, నిర్మాత రాజ్ కుమార్.. కథ, కథనం ప్రేక్షకులను కట్టిపడేస్తుందని తెలిపారు. దర్శకుడు సుభాష్ టేకింగ్ చాలా బాగుందని, కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు వాక్సిన్ కోసం ఎదురుచూసే కథ నేపథ్యంలో సినిమా ఉంటుందన్నారు. సినిమా చాలా రిచ్‌గా ఉంటుందని, ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌కు స్పెషల్ కాంప్లిమెంట్స్ అందుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సెన్సార్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి కాగా.. సినిమా విడుదల తేదీతో పాటు మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

అనూష, నందిత రాజ్ కుమార్‌కు జోడీగా నటించగా.. మురళీ లియోన్ సంగీతం అందించారు. ఫైట్ సీక్వెన్స్ దేవరాజ్ డిజైన్ చేయగా, సబ్బి శ్రీనివాస్ కెమెరా పనితనం గురించి ప్రశంసించారు. తమ సినిమాకు రైటర్‌గా పనిచేసిన ప్రతాప్ భవిష్యత్తులో ఎదుగుతారని.. లోకేష్ ఎడిటింగ్ బాగుందని తెలిపారు.

Advertisement

Next Story