- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ధ్రువాస్త్ర’ ప్రయోగం సక్సెస్
దిశ, వెబ్ డెస్క్ :పొరుగు దేశాలతో పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ అత్యధునిక యుద్ధ సామగ్రిని దిగుమతి చేసుకోవడమే కాకుండా దేశీయంగా కూడా తయారు చేస్తున్నది. ఇప్పటికే మన వద్ద అగ్నికి సంబంధించిన మిసైల్స్ అన్ని దేశీయంగా రూపొందించబడినవే అందుకు నిదర్శనం. అయితే, మన దేశంతో కయ్యానికి కాలుదువ్వే దేశాలకు భారత్ దీటుగా బదులిస్తోంది. దానికి కారణం రక్షణ రంగంలో పురోగతిని సాధించడమేనని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఒడిషాలోని బాలాసోర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి నిర్వహించిన ట్యాంక్ విధ్వంసక క్షిపణి ‘ధ్రువాస్త్ర’ ప్రయోగాలు మూడూ విజయవంతమయ్యాయి. భారత పరిశోధన, అభివృద్ది సంస్థ (డీఆర్‌డీఏ) రూపొందించిన ఈ మిసైళ్లను హెలికాఫ్టర్ పై నుంచి ప్రయోగించవచ్చు.. ప్రపంచంలోని ఈ తరహా క్షిపణుల్లో ఇది అత్యంత ఆధునికమైనదని డీఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి. ఈ నెల 15, 16 తేదీల్లోనూ., తాజాగా 22న మరో మిసైల్‌ను ప్రయోగించారు. ఆకాశం నుండి భూమి మీద కదిలే శత్రు ట్యాంకర్లను నాశనం చేయగల ధ్రువాస్త్ర మిసైళ్ళు సైన్యానికి ఎంతో ఉపయోగపడుతాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.