- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఘటనపై అనుమానెలెన్నో…
దిశ వెబ్ డెస్క్: అంతర్వేది లక్షీనరసింహ స్వామి రథం దగ్గమైన ఘటనలో దుమారం రేగుతోంది. రథం దగ్దం వెనక కుట్ర కోణాలు ఉన్నాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణమ రాజు స్పందించారు. రథం కాలిన ఘటనను చూస్తుంటే దీని వెనక కుట్ర ఉన్నట్టు కనిపిస్తోందన్నారు.
రథాన్ని పిచ్చి వాడెవరో కాల్చి వేసినట్టు చెప్పి కేసు కొట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని అన్నారు. దోషులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలన్నారు. దీనిపై సీఎం జగన్ ప్రకటన చేయాలని అన్నారు. రాబోయే కాలంలో ఇలాంటి ఘటనలు జరగకుండా సీఎం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
కాగా అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రథం శనివారం కాలిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఘటనపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఎవరో కావాలనే తగులపెట్టారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనిపై ఏపీ సర్కార్ సీరియస్ గా ఉంది. ఘటనకు బాధ్యులపైన కఠిన చర్యలు తీసకుంటామని అని మంత్రి శ్రీనివాస్ అన్నారు.