ముక్కును చికెన్ ముక్కలా కొరికేసిన యువతి

by Sumithra |   ( Updated:2021-02-08 09:34:53.0  )
ముక్కును చికెన్ ముక్కలా కొరికేసిన యువతి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇద్దరు ఆడవాళ్ల మధ్య గొడవ అంటే రచ్చరచ్చే. మధ్యలో ఎవరైన అడ్డుకున్నా.. అడ్డుకోకపోయినా కష్టమే. చిన్న చిన్న విషయాలకే చివాట్లు పెట్టుకునే ఆడవాళ్లు కొందరు ఉంటారు. వాళ్లది పక్కపక్క ఇండ్లే అయితే మరీ కష్టం. చెన్నైలో జరిగిన గొడవలో ఓ మహిళ ముక్కును ఓ యువతి కొరికేసింది.

తమిళనాడులోని వాల్పరై పోలీస్ స్టేషన్ పరిధిలోని స్టాన్మూర్ ఎస్టేట్ వంతెన సమీపంలో రెండు కుటుంబాలు పక్కపక్కనే నివాసం ఉంటున్నాయి. ఆ కుటుంబాల్లోని ఇద్దరు మహిళలైన రేవతి, తంగమ్మాళ్‌కు మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రాత్రి ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది.

రేవతి తరుచూ తన తల్లి తంగమ్మాళ్‌తో గొడవ పడుతుండడంతో ఆగ్రహించిన తంగమ్మాళ్‌ కుమార్తె లక్ష్మి వత్సల.. రేవతిపై పడి ఆమె ముక్కు కొరికేసింది. తీవ్రంగా గాయపడిన రేవతికి అధిక రక్తస్రావం జరిగి పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకోని బాధితురాలిని ఆస్పత్రి తరలించారు. తల్లీ కూతురును అరెస్టు చేశారు.

Advertisement

Next Story

Most Viewed