సుశాంత్ సూసైడ్.. సంచలన నిజాలు

by Anukaran |
సుశాంత్ సూసైడ్.. సంచలన నిజాలు
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో సీబీఐ విచారణ ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పితాని.. సీబీఐ విచారణలో సంచలన నిజాలు బయటపెట్టాడు. జూన్ 8న రియా చక్రవర్తి సుశాంత్‌తో గొడవపడినట్లు సిద్ధార్థ్ పితాని వాంగ్మూలం ఇచ్చాడు.

గొడవ తర్వాత రియా అక్కడి నుంచి వెళ్లి పోయిందన్నారు. అయితే, పలు కీలక ఆధారాలు లభించకుండా 8 హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్లు సిధార్థ్ పితాని స్పష్టం చేశాడు. ధ్వంసం చేస్తున్న సమయంలో సుశాంత్ మేనేజర్ దీపేష్, వంటమనిషి ధీరజ్ కూడా ఉన్నారన్నాడు. ధ్వంసం చేసిన హార్డ్ డిస్కుల్లో ఏముందో తనకు కూడా తెలియదు అని సిద్ధార్థ్ పితాని వివరణ ఇచ్చాడు. రియా సమక్షంలోనే ఇదంతా జరిగినట్లు సీబీఐ చేతికి ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed