- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
8 శాతం ధరల పెంపు నిర్ణయం ప్రకటించిన హావెల్స్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ విద్యుత్తు ఉపకరణాల సంస్థ హావెల్స్ తయారీలో కీలకమైన విడిభాగాల వ్యయం పెరుగుతున్న కారణంగా తన ఉత్పత్తుల ధరలను పెంచాలని భావిస్తున్నట్టు తెలిపింది. కొత్త ఏడాదిలో ఈ పెంపు అమలవుతుందని కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ రాయ్ అన్నారు. ఇప్పటివరకు విడిభాగాల ఖర్చులను అవసరమైనంత వరకు కొనసాగిస్తూ వచ్చాము. అయితే, వీటి భారం ఎప్పటికప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు కొంత బదిలీ చేయక తప్పలేదు. దీనివల్ల వచ్చే ఏడాదిలో హావెల్స్ ఉత్పత్తులు 7-8 శాతం పెరిగే అవకాశం ఉంటుందని’ అనిల్ రాయ్ పేర్కొన్నారు.
ఇదే సమయంలో హావెల్స్ సంస్థ దేశీయంగా విస్తరణ ప్రక్రియను చేపట్టనున్నట్టు, దీని కోసం రూ. 500 కోట్ల రెండు ప్లాంట్‌ల ఏర్పాటును చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. వాటిలో ఒకటి ఏసీలు, రెండో ప్లాంటును వాషింగ్ మెషీన్లు తయారీ కోసమని కంపెనీ పేర్కొంది. ఈ నిర్ణయంతో భారత్‌లో తమ ఉనికిని మరింత బలోపేతం చేస్తుందని కంపెనీ వివరించింది. ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా నినాదానికి అనుగుణంగా స్థానిక ఉత్పత్తిని మరింత పటిష్టం చేయనున్నట్లు అనిల్ రాయ్ చెప్పారు.