పాస్ పుస్తకాలను రద్దు చేసిన కలెక్టర్

దిశ, వెబ్‌డెస్క్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు వ్యవహారం రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏసీబీ అధికారులు విచారణ ముమ్మరం చేస్తున్నారు. బెయిల్ కోసం అభ్యర్థించిన నిందితుల పిటిషన్‌ను సైతం ఏసీబీ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ఇది ఇలా ఉండగా.. గతంలో నాగరాజు జారీ చేసిన పాస్ పుస్తకాలను జిల్లా కలెక్టర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ పాస్ పుస్తకాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు.

 

Advertisement