- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రానికి మరో ముప్పు.. కాచుకు కూర్చున్న పెను తుఫాన్
దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రాకు ఇప్పుడు మరో పెను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్రానికి మరో తుఫాను సెగ తగల నుంది. థాయిలాండ్, దక్షిణ అండమాన్ సముద్రంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం, వాయువ్య దిశగా కదిలి 15 తేదీ నాటికి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని వాతావారణ శాఖ తెలిపింది.
అయితే తీరానికి చేరుకోవడానికి మూడు రోజులు ఆలస్యం అవుతుందని, ఈ నెల 18 న తీరం తాకే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఏ ప్రాంతంలో తీరాన్ని తాకనుంది అనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. ఉత్తర తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్ వరకూ ఈ ద్రోణి ప్రభావం ఉంటుందని, ఇవాళ, రేపు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
రాష్ట్రంలో వాతావరణం మేఘావృతమై ఉండటం వల్ల ఇప్పటికే అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, కడప, అనంతపురం, శ్రీకాఖుళం లలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షలు కురిశాయి.