బిగ్‌బ్రేకింగ్.. ఈటల రాజేందర్‌పై మరో కేసు నమోదు

by Anukaran |   ( Updated:2021-10-12 12:10:01.0  )
బిగ్‌బ్రేకింగ్.. ఈటల రాజేందర్‌పై మరో కేసు నమోదు
X

దిశ, కరీంనగర్ ప్రతినిధి: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై మరో కేసు నమోదైంది. ఈ నెల 5న హుజూరాబాద్ మండలం బొత్లపల్లిలో రాత్రి 7.30 గంటల వరకు.. 100కి పైగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారని ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఇన్‌చార్జీ కిషోర్ హుజూరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈటలతో పాటు బీజేపీ మైనార్టీ మోర్చా నాయకుడు అజహర్ కూడా ఈ సమావేశంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఎఫ్ఎస్‌టీ ఇన్‌చార్జీ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళవారం కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుజూరాబాద్ పోలీసులు క్రైం నెంబర్ 317/2021, ఐపీసీ సెక్షన్ 188, సెక్షన్ 51(బి) ఆఫ్ డీఎం యాక్ట్ 2005 ప్రకారం కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story