బావిలో మరో మృతదేహం.. గొర్రెకుంటలో ఆందోళన

by Sumithra |   ( Updated:2020-05-21 22:08:37.0  )
బావిలో మరో మృతదేహం.. గొర్రెకుంటలో ఆందోళన
X

దిశ, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట గ్రామంలోని బావిలో పడి పశ్చిమ బెంగాల్ కు చెందిన వలస కూలీ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం ఆ బావిలో మరో మృతదేహం కనిపించింది. ఉదయం అటువైపుగా మార్నింగ్ వాకింగ్ వెళ్లిన కొందరు గ్రామస్తులు బావిలో శవం తేలియాడుతుండడాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం గురువారం చనిపోయిన కుటుంబానికి చెందిన ఒకరిదిగా భావిస్తున్నారు. అయితే వలస కూలీ కుటుంబ సభ్యులు మొత్తం ఆరుగురు కాగా మరొకరి ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది. వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గొర్రెకుంటలో నివాసముంటున్న పశ్చిమ బెంగాల్ ‌కు చెందిన ఆరుగురి కుటుంబ సభ్యుల్లో నలుగురు బావిలో పడి మృతిచెందగా నిన్న రాత్రి మృతదేహాలు గుర్తించి, వెలికి తీశారు.

Advertisement

Next Story

Most Viewed