మరో 14.69 లక్షల మందికి రైతుబంధు

by Shyam |
మరో 14.69 లక్షల మందికి రైతుబంధు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైతుబంధు పంపిణీ కొనసాగుతోంది. ఎకరం వ్యవసాయ భూమిలోపు రైతులకు సోమవారం పెట్టుబడి సాయాన్ని జమ చేయగా… మంగళవారం రెండెకరాలలోపు రైతులకు జమ చేశారు. మంగళవారం 14,69,039 మంది రైతులకు రూ. 1125,31,10,168లను వారి ఖాతాల్లో జమ చేశారు. మొత్తం 14.69 లక్షల మంది రైతులకు రూ. 1125 కోట్లు జమ అయ్యాయి. ఇప్పటి వరకు 30.73 లక్షల మంది రైతులకు రూ. 1619.42 కోట్లు రైతుబంధు పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

Next Story