- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
దిశ, నేరేడుచర్ల: గౌడ కులస్థులకు వైన్ షాపుల టెండర్లలో రిజర్వేషన్ కల్పించినందుకు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ శుక్రవారం నేరేడుచర్ల పట్టణంలోని చౌరస్తా వద్ద మండల గౌడ కులస్థుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్ పర్సన్ చందమళ్ల జయబాబు , చల్లా శ్రీలతారెడ్డిలు మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
వైన్ షాపుల నిర్వహణలో ఎస్సీలకు, గౌడ కులస్థులకు రిజర్వేషన్ కల్పించడం హర్షణీయమన్నారు. గౌడ కులస్థుల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జిల్లా మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి, హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిల్లేపల్లి పిఎసీఎస్ చైర్మన్ అనంతు శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి చిత్తలూరి సైదులు, మత్స్యపారిశ్రామిక సహాకార సంఘం చైర్మన్ పేరబోయిన వీరయ్య, నాయకులు కొణతం సత్యనారాయణ రెడ్డి, ఇంజమూరి రాములు, బుడిగ చంద్రయ్య గౌడ్, ఆకుల జగతయ్య గౌడ్, వెంకన్న, లక్ష్మీనారాయణ, రాము, సీతారాములు, సైదులు, భరత్ ఉన్నారు.