- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పేద విద్యార్థుల కోసం వంటమనిషిగా మారిన హెడ్‌మాస్టర్..!
దిశ, తుంగతుర్తి: టక్కు వేసుకుని టిక్ టాక్‌గా ఫొటోలో కనిపిస్తున్న వీరిని చూస్తుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది..? ఆ…! వారికి ఏ పని పాట లేక సంతోషంతో గరిట చేతపట్టి ఒకరు, గిన్నెలో పప్పు వేస్తున్నట్లు మరొకరు ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారులే.. అని అనుకుంటారు. కొందరైతే వారి ఇంట్లో జరిగే ఫంక్షన్ కో లేక వనవాసం వెళ్ళినప్పుడు ఇలా చేసుకుంటున్నారేమో ? అని టక్కున చెప్పేస్తుంటారు. కానీ, వీరు చేసే శ్రమ, పడుతున్న కష్టాలకు పైన పేర్కొన్న విషయాలు ఏవీ సరిపోవు. ఇంతకీ అసలు విషయానికి వస్తే…!
వెంకీ పెళ్లి సుబ్బి చావుకు వచ్చిన సామెత మాదిరిగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండి పెట్టే సమ భావన సంఘం సభ్యుల మధ్య ఏర్పడ్డ విభేదాలు చివరికి పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుల కష్టాలకు దారితీశాయి. పొయ్యి మీద పెట్టిన వంట పాత్రలో పప్పును వేస్తున్న వ్యక్తి పేరు ఎం.గురవయ్య. ఇతను పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు. గరిట పట్టిన వ్యక్తి పేరు సోమయ్య ఇతను పాఠశాల సిబ్బంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నెలకొన్న దృశ్యమిది.
పాఠశాలలో మొత్తంగా 115 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే విద్యార్థులకు మధ్యాహ్నం భోజన వంట చేసిపెట్టే ఒప్పందాన్ని చేసుకుని గత పది సంవత్సరాల నుండి అదే గ్రామానికి చెందిన బి.మంగమ్మ, ఎం. పద్మ, సీహెచ్. మల్లమ్మ అనే ముగ్గురు సంభావన సంఘ సభ్యులు చేపడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో సభ్యుల మధ్య ఏర్పడిన విభేదాలు చిలికి చిలికి గాలి వానలా మారాయి. ముగ్గురు సభ్యులలో నిత్యం ఒకరు వస్తే మరొకరు రాకపోవడం, మరో రోజు ఇద్దరు రాక ఒక్కరే రావడం లాంటివి జరుగుతుండడంతో విద్యార్థులకు భోజనాలు సకాలంలో అందక, రుచికరంగా లేకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతుండేవి.
ఈ విషయంపై ఎన్నోమార్లు పాఠశాల యాజమాన్యం, విద్యా కమిటీ చైర్మన్, గ్రామ పెద్దలు చెప్పినా కూడా మార్పు కనిపించలేదు. కాగా సోమవారం ఎలాంటి సమాచారం లేకుండా ముగ్గురు సభ్యులు పాఠశాలకు రాకపోవడంతో చేసేదేమీలేక చివరికి ప్రధానోపాధ్యాయుడు గురువయ్య, సిబ్బంది సోమయ్య, తదితరులు స్వయంగా వంటలు చేసి విద్యార్థులకు పెట్టారు. కాగా ఇలాంటి సంఘటనలు గత కొంత కాలం నుండి జరుగుతున్నప్పటికీ పరిష్కార మార్గాలు లభించలేదు. చివరికి పాఠశాల యాజమాన్యం జిల్లా, మండల విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.