- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ స్ట్రైకర్స్ కెప్టెన్‌గా అంకిత రైనా
దిశ, స్పోర్ట్స్: టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) 3వ సీజన్ ఈ ఏడాది రెండో అర్ద భాగంలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఆటగాళ్ల వేలంపాట మంగళవారం ముంబయిలో నిర్వహించారు. ఈ వేలంలో ఇండియా టాప్ ర్యాంకర్ మహిళా టెన్నిస్ ప్లేయర్ అంకిత రైనా అత్యధిక ధరకు అమ్ముడుపోయింది. హైదరాబాద్ స్ట్రైకర్స్ జట్టు ఆమెను రూ. 4.10 లక్షలకు కొనుగోలు చేసింది. హైదరాబాద్ ఫ్రాంచైజీ అర్జున్ కధే రూ. 2.60 లక్షలు, విష్ణు వర్దన్ రూ. 2.05 లక్షలకు దక్కించుకున్నది. తమ జట్టును అంకిత రైనా నడిపిస్తుందని యాజమాన్యం తెలిపింది. టెన్నిస్ ప్రీమియర్ లీగ్‌లో ఎనిమిది ఫ్రాంచైజీలు ఉన్నాయి.
ప్రతీ జట్టులో ఐదురుగు ఉంటారు. వీరిలో ఇద్దరు మహిళ ప్లేయర్లు, ముగ్గురు పురుష ప్లేయర్లు ఉంటారు. జూన్ తర్వాత దేశవ్యాప్తంగా జరిగే టాలెంట్ డే మ్యాచ్‌ల ఆధారంగా మరో ఇద్దరు (ఒక పురుష, ఒక మహిళ) ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. హైదరాబాద్ స్ట్రైకర్స్ జట్టుకు వ్యాపారి బ్రిజ్‌గోపాల్, రకుల్ ప్రీత్ సింగ్ యజమానులుగా వ్యవహరిస్తున్నారు. ‘మన దేశంలో టెన్నిస్ ఇంకా అభివృద్ది చెందాల్సి ఉన్నది. మనకు ఎంతో మంది ప్రతిభగల క్రీడాకారులు ఉన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే లీగ్‌లో హైదరాబాద్ స్ట్రైకర్స్ మంచి ప్రతిభ కనపరుస్తుంది’ అని రకుల్ ప్రీత్ అన్నారు.