చెన్నైయన్ ఎఫ్‌సీతోనే అనిరుధ్ థాపా

by Shyam |
చెన్నైయన్ ఎఫ్‌సీతోనే అనిరుధ్ థాపా
X

దిశ, స్పోర్ట్స్: జాతీయ ఫుట్‌బాల్ జట్టు మిడ్ ఫీల్డర్ అనిరుధ్ థాపా త్వరలో జరగబోయే ఇండియాన్ సూపర్ లీగ్‌లో చెన్నైయన్ ఎఫ్‌సీతోనే కొనసాగనున్నట్టు జట్టు యాజమాన్యం గురువారం ప్రకటించింది. అనిరుధ్‌తో పాటు భారత జట్టుకు చెందిన తొమ్మిది మంది ఫుట్‌ బాలర్స్ కూడా చెన్నైయన్‌ జట్టుకే ఆడనున్నట్టు తెలుస్తున్నది. 2017, 2018లో ఐఎస్ఎల్ చాంపియన్లుగా నిలిచిన చెన్నైయన్ జట్టు మరోసారి టైటిల్‌పై కన్నేసింది.

2016 నుంచి చెన్నైయన్‌తోనే కొనసాగుతున్న అనిరుధ్ థాపాను మరి కొన్నేళ్లు జట్టులోనే కొనసాగేలా ఒప్పందం కుదుర్చుకుంది. థాపాతో పాటు ధోయ్ సింగ్, ధన్‌పాల్ గణేష్, సినివాసన్ పాండియన్, ఎడ్విన్ సిడ్నీ వన్స్‌పాల్, విశాల్ కైథ్, లల్లియన్జుల చాంగ్టే, దీపక్ తంగ్రీ, రహీమ్ అలీ కాంట్రాక్టును కూడా పొడిగించినట్లు యాజమాన్యం తెలిపింది. 2020-21 సీజన్ ఐఎస్ఎల్ గోవాలో నిర్వహించనున్నారు. చెన్నైయన్ జట్టు తమ 9 హోం గ్రౌండ్ మ్యాచ్‌లు బాంబోలిమ్‌లోని జీఎంసీ అథ్లెటిక్స్ స్టేడియంలో ఆడనున్నారు.

Advertisement

Next Story