- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యానిమల్ ఫ్రెండ్లీ సెలెబ్రిటీస్..
దిశ, వెబ్‌డెస్క్: జీవహింస మహాపాపం అని పురాణాలు చెప్పినా సరే, పాపం ఏంటి పాపం.. తింటే ఏంటి? అని వితండవాదం మొదలుపెట్టేవారికి కొదువే లేదు. ఇంకా కొందరైతే అవి అలా చచ్చిపోయి, మనకు ఆహారంగా మారాలని రాసిపెట్టి ఉందేమో.. అంటుంటారు. పదిలో తొమ్మిది మంది దాదాపు ఇలాగే ఆలోచిస్తుంటారు. అందుకే ఆకలేస్తే బిర్యానీ అంటాం.. చికెన్, మటన్ తిన్నాక ఎన్ని రోజులయిందిరా తిని అనే ఓ డైలాగ్ పడేస్తాం. పైగా ‘సండే వచ్చింది కోడిని లేపాయాల్సిందే.. మేకను కట్ చేయాల్సిందే’ అంటూ మీమ్స్ కూడా. కానీ, అవి కూడా మనలాంటి ప్రాణులే.. మనతో పాటే భూమి మీద బతికేందుకు వచ్చాయి. వాటిని కూడా బతకనిద్దామని ఆలోచించేవారు కనీసం పదిశాతం కూడా ఉండరేమో. ఆ పదిశాతమైనా ఎవరు శాకాహారులు.
‘పురాణాలు చెప్పింది నిజం.. జీవహింస వద్దు’ అని చెప్పేందుకు ‘పెటా’ సంస్థ కొన్నేళ్లుగా ట్రై చేస్తోంది. ఇందుకోసం సినీ సెలెబ్రిటీలను ఎంచుకుని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. సన్నీలియోన్, ఆలియా భట్, అమీ జాక్సన్, లారా దత్తా, త్రిష, నీల్ నితిన్ ముఖేష్, మోనికా డోగ్రా, ప్రియా ఆనంద్, షాహిద్ కపూర్, సానియా మీర్జా ఈ సంస్థకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ మెసేజ్ ఇస్తున్నారు.
‘సింథెటిక్ లెదర్, మాక్ క్రాక్, ఫాక్స్ ఫర్’ లాంటి శాకాహార వస్త్ర వస్తువులు మాత్రమే వాడాలని పిలుపునిచ్చింది హాట్ బ్యూటీ సన్నీ లియోన్. మన చర్మంతో మనం కంఫర్ట్‌గా ఉన్నప్పుడు జంతువులను కూడా అలాగే ఉండనిద్దామని సూచించింది. మూగజీవులను చంపి వాటి చర్మంతో దుస్తులు తయారు చేయడం అవసరమా? అనే ఉద్దేశ్యంతో ఈ మెసేజ్ ఇచ్చింది సన్నీ. వెజిటేరియన్‌గా ఉంటూ మీ లైఫ్‌ను స్పైసీగా మార్చుకోవాలని సూచించింది.
జంతువులను దత్తత తీసుకోవాలే తప్ప.. వాటిని కొని ఆహారంగా మార్చకూడదని పిలుపునిచ్చారు ఆలియా భట్, త్రిష. కుక్క పిల్లలు, పిల్లుల వంటి పెట్ యానిమల్స్‌కు షెల్టర్, ఫుడ్‌తో పాటు కాస్త లవ్ అందిస్తూ.. వాటికి దేవతల్లా మారుదామని పిలుపునిచ్చారు. మంచి ఫ్రెండ్స్‌లా ఉందామని కోరుతున్నారు.
హాట్ బ్యూటీ అమీ జాక్సన్.. పెటా అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. మన శరీరం మీద గాయమైతే ఎంత బాధగా ఉంటుంది? అదే బాధ జంతువులకు కూడా ఉంటుందని చెప్పింది అమీ. మనది బాధే అయినప్పడు వాటిది కూడా బాధే కదా.. అలాంటప్పుడు వాటిని ఎందుకు హింసించాలని ప్రశ్నించింది.
బాలీవుడ్ హీరోయిన్ లారా దత్తా.. అందరం శాకాహారులుగా మారిపోదామని పిలుపునిచ్చింది. జీవహింసను మాని.. ఆకులు, కూరగాయలను ఆహారంగా తీసుకుని కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దామని సూచించింది.
టాలెంటెడ్ యాక్టర్ నీల్ నితిన్ ముఖేష్.. ఏనుగుల పరిస్థితి గురించి వివరిస్తూ ‘పెటా’ స్వచ్ఛంద సంస్థ ద్వారా గుడ్ మెసేజ్ ఇచ్చారు. జాయ్ ఫుల్ రైడ్ కోరుకునే ఏనుగులను అనవసరంగా బంధిస్తున్నామని.. వాటిని చిత్రహింసలు పెడుతున్నామని అన్నారు. కొడుతూ, సంకెళ్లు వేసి బంధిస్తూ వాటిని చిత్రవధ చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంస్కృతి పోవాలని కోరారు.
పక్షులను ఎగరనిద్దామని.. వాటిని స్వేచ్ఛగా వదిలేద్దామని కోరింది ప్రియా ఆనంద్. ఒక వ్యక్తికి స్వేచ్ఛ ఎంత అవసరమో.. వాటికి కూడా అంతే అని అభిప్రాయపడింది. వాటికి సృష్టితో ఉన్న అనుబంధాన్ని అలాగే ఉండనిద్దామని.. పంజరాల్లో బంధించకుండా ఎగరనిద్దామని కోరింది.
కోడిపిల్లలు వెజిటేరియన్‌ను ప్రేమిస్తాయని తెలిపిన బాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ షాహిద్ కపూర్.. కంప్లీట్ వెగాన్‌గా మారుదామని కోరుతున్నారు. వాటిని చంపి ఆహారంగా తీసుకునే బదులు.. అవి ప్రేమించే మనుషుల్లా ఉందామని సూచించారు.