ఫ్యాన్స్‌కు పండగే.. ‘ఎవెంజర్‌’కు మించిన పవర్స్‌తో ‘ఎటెర్నల్స్’ సూపర్ హీరోస్

by Shyam |
ఫ్యాన్స్‌కు పండగే.. ‘ఎవెంజర్‌’కు మించిన పవర్స్‌తో ‘ఎటెర్నల్స్’ సూపర్ హీరోస్
X

దిశ, సినిమా: ‘ఎవెంజ‌ర్స్’ సిరీస్ కంప్లీట్ అవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ల‌వ‌ర్స్‌ని మరోసారి ఎంట‌ర్‌టైన్ చేసేందుకు మార్వెల్ సంస్థ ‘ఎటెర్నల్స్’ అనే కొత్త సూప‌ర్ హీరోలను సృష్టించింది. అయితే ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌తో పాటు భార‌త‌దేశంలోని భాషల్లోనూ ఒకేసారి విడుద‌ల చేయ‌నున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజెలీనా జోలీ.. థేనా అనే సూప‌ర్ ఉమన్ గెటెప్‌లో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేయబోతోంది. ఈ మేరకు దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 5న‌ డిస్నీ – మార్వెల్ లేటెస్ట్ సూప‌ర్ హీరో మూవీ ‘ఎటెర్నల్స్’ విడుద‌ల చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. అలాగే ‘ఎవెంజ‌ర్స్‌’కి మించిన ప‌వ‌ర్స్‌తో ‘ఎటెర్నల్స్’ సూప‌ర్ హీరోలు అద్భుత‌మైన విన్యాసాలతో ఆకట్టుకోనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఇందులో ఇండియ‌న్ వెడ్డింగ్‌కి సంబంధించిన స‌న్నివేశాలు కూడా ఉన్నాయ‌ని డిస్నీ ఇండియా టీమ్ వెల్లడించింది.

Advertisement

Next Story