తొగుట ఇంచార్జ్‎గా ఆందోల్ ఎమ్మెల్యే..!

దిశ, ఆందోల్: దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో తొగుట మండల ఇంచార్జ్‎గా ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‎ను నియమించారు. ఈ సందర్భంగా శనివారం దుబ్బాక నియోజకవర్గంలోని తొగుటలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సమావేశం నిర్వహించారు. రామలింగారెడ్డి మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.

Advertisement