YSRCP: రాజకీయాలకు స్వస్తి చెప్పిన విజయసాయి రెడ్డి మరో సంచలన నిర్ణయం

by Ramesh Goud |
YSRCP: రాజకీయాలకు స్వస్తి చెప్పిన విజయసాయి రెడ్డి మరో సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: రాజకీయాలకు స్వస్తి చెప్పిన వైసీపీ నేత విజయసాయిరెడ్డి(YCP Leader Vijayasai Reddy) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనికై అనుమతి కోసం ఏసీబీ కోర్టు(CBI Court) మెట్లు ఎక్కారు. విజయసాయిరెడ్డి రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని సంచలన ప్రకటన చేశారు. అంతేగాక ఆయన విదేశాలను(Foreign) వెళ్లేందుకు అనుమతి కోరుతూ.. సీబీఐ కోర్టును ఆశ్రయించారు. నార్వే(Norway), ఫ్రాన్స్(France) దేశాలను వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి మంజూరు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. విజయ సాయి రెడ్డి పిటిషన్ ను స్వీకరించిన కోర్టు విచారణ జరిపింది. ఇందులో సీబీఐ(CBI) స్పందన కోరతామని పిటిషనర్ తరుపు న్యాయవాదికి తెలిపింది. సీబీఐ వివరణ కోసం పిటిషన్ విచారణను ఈ నెల 27 కు వాయిదా వేస్తున్నట్లు సీబీఐ కోర్టు వెల్లడించింది.

Next Story