Viveka Case: కడపలో సీబీఐ టీమ్.. పులివెందుల్లో అవినాశ్ రెడ్డి.. కొనసాగుతున్న ఉత్కంఠ

by srinivas |
Viveka Case: కడపలో సీబీఐ టీమ్.. పులివెందుల్లో అవినాశ్ రెడ్డి.. కొనసాగుతున్న ఉత్కంఠ
X

దిశ, కడప ప్రతినిధి: వివేకా హత్య కేసు విచారణ, అవినాష్ రెడ్డి అరెస్టు వ్యవహారం రోజు రోజుకు ఉత్కంఠ రేపుతున్నాయి. అవినాష్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు విచారణకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో సీబీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అన్న ఉత్కంఠ రేగుతుంది. ఈ పరిస్థితుల్లో ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందులకు వెళ్లారు. ఈలోపే సీబీఐ బృందం ఒకటి కడపకు చేరుకుంది. దీంతో జిల్లాలో అవినాష్ అరెస్ట్ వ్యవహారంలో ఏం జరగబోతుందోనన్న టెన్షన్ వాతావరణం నెలకొంది.

కొంతకాలంగా అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడం ఖాయమన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆయనకు ముందస్తు బైయిల్ రాకపోవడంతో సీబీఐ తన విచారణలో భాగంగా అరెస్టు చేస్తుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు తోడు సిబిఐ టీం కడపకు చేరుకోవడం జరిగింది. సిబిఐ ఎస్పి ఎస్పీ వికాస్ సింగ్ , అడిషనల్ ఎస్పీ ముఖేష్ శర్మలు కూడా చేరుకోనున్నట్లు సమాచారం. ఇదే తరుణంలో అవినాష్ రెడ్డి ఆదివారం పులివెందుల నియోజకవర్గంలో గడపగడప కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఒకవైపు సిబిఐ జిల్లాకు చేరుకోవడం, మరోవైపు అవినాష్ రెడ్డి కూడా పులివెందులకు చేరుకోవడంతో ఉత్కంఠ రేగుతోంది. ఈసారి కడప కు చేరుకున్న సిబిఐ అవినాష్ కోసమా, మరెవరైనా కోసమా అన్న అనుమానాలు పులివెందుల ప్రజల్లో కలుగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed