Nara Lokesh : యువగళానికి తాత్కాలిక బ్రేక్

by srinivas |   ( Updated:2023-05-25 11:32:19.0  )
Nara Lokesh : యువగళానికి తాత్కాలిక బ్రేక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. యువగళం పాదయాత్రను నాలుగు రోజుల పాటు వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈనెల 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా లోకేశ్ పాదయాత్రకు విరామం ప్రకటించారు.

ఈ నేపథ్యంలో గురువారం జమ్మలమడుగులో పాదయాత్రను లోకేశ్ ముగించారు. తర్వాత అక్కడి నుంచి కడప ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ప్రత్యేక విమానంలో అమరావతికి పయనమయ్యారు. శుక్రవారం అమరావతి నుంచి బయల్దేరి వెళ్లి రాజమహేంద్రవరంలో జరిగే మహానాడు ప్రాంతానికి చేరుకోనున్నారు. తిరిగి ఈనెల 30న పున:ప్రారంభించనున్నారు.

Advertisement

Next Story