- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ లేదు: Siddhartha Kaushal
దిశ, కడప: వైయస్సార్ జిల్లా నూతన ఎస్.పిగా సిద్దార్థ్ కౌశల్ బాధ్యతలు చేపట్టారు. శాంతిభద్రతలు కాపాడే విషయంలో రాజీ ప్రసక్తే లేదని ఎస్.పిగా సిద్దార్థ్ కౌశల్ అన్నారు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలందించడంలో ముందుంటామని జిల్లా ఎస్.పి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలైన మహిళా భద్రత, అసాంఘిక శక్తుల నిర్మూలన, సిటిజన్ చార్టర్ అమలు, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, సైబర్ నేరాల కట్టడి, పెండింగ్ కేసుల పరిష్కారం వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా తనను నేరుగా కానీ, 'స్పందన'లో కానీ సంప్రదించవచ్చన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో సమష్టిగా ముందుకువెళతామని తెలిపారు. ముఖ్యమంత్రి జిల్లాలో విధులు నిర్వర్తించే అవకాశం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని సిద్దార్థ్ కౌశల్ పేర్కొన్నారు.
స్పందనలో..
కడప జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన స్పందన కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల వినతి పత్రాలను స్వీకరించారు. వీరి సమస్యలపై సత్వరం స్పందించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు.సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులకు సందర్భంగా ఎస్పి సిద్ధార్థ కౌశల్ సూచించారు.