Kadapa: ఎర్రచందనం స్మగ్లర్ భాస్కర్‌రెడ్డి‌పై పీడీ యాక్ట్

by srinivas |
Kadapa: ఎర్రచందనం స్మగ్లర్ భాస్కర్‌రెడ్డి‌పై పీడీ యాక్ట్
X

దిశ, కడప: ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న కరడు గట్టిన అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ మండాది భాస్కర్‌రెడ్డి (47)పై పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. భాస్కర్ రెడ్డి స్వస్థలం ప్రొద్దుటూరు. ఆయనపై ఉమ్మడి కడప జిల్లాలో ఐదు ఎర్ర చందనం రవాణా కేసులున్నాయి. తమిళనాడు కూలీలతో ఎర్ర చందనాన్ని చెన్నై స్మగ్లర్లకు ట్రాన్స్‌పోర్టు చేయిన్నారు. తన సిఫారసు మేరకు భాస్కర్ రెడ్డిపై కలెక్టర్ వి.విజయరామరాజు పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఎస్పీ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed