- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kadapa: పెనుగాలుల బీభత్సం.. ముగ్గురు మృతి, భారీగా పంట నష్టం
దిశ, కడప ప్రతినిధి: కడప జిల్లాలో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. అకాల వర్షం కుమ్మేసింది. పెను గాలులు, అకాల వర్షానికి పంట నష్టాలతో పాటు ప్రాణ నష్టం కూడా చోటు చేసుకుంది.పెద్ద పెద్ద చెట్లు విద్యుత్ స్తంభాలు నెలకొరుగాయి. అరగంట పాటు కురిసిన వర్షానికి కొన్నిచోట్ల రోడ్లపై వాహనాలు వెళ్లేందుకు కూడా వీలు లేనంత దట్టమైన వర్షాలు కురిశాయి. జిల్లాలోని పలుచోట్ల కురిసిన వడగళ్ల వాన పెను గాలులకు నష్టం తీవ్రంగానే జరిగింది.
పెనుగాలులు, వర్షాలు పిడుగుపాటుకు జిల్లాలో ముగ్గురు మృతి చెందిన విషాద సంఘటనలు నెలకొన్నాయి. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఒక్కసారిగా అకాల వర్షం ,పెను గాలులు బీభత్సం సృష్టించాయి. బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలంలో రేకుల షెడ్డు కూలి ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. బేతాయపల్లికి చెందిన పిల్లకాయల చిన్న సుబ్బయ్య ద్విచక్ర వాహనంపై తమ గ్రామానికి వెళుతూ వర్షం, గాలి అధికం కావడంతో ఓ రేకుల షెడ్డు కిందకు వెళ్ళాడు. ఇంతలో అది కూలిపోయింది. గోడ కూలవడంతో చిన్న సుబ్బయ్య అక్కడికక్కడే మృతి చెందారు . కలసపాడు మండలం తెల్లపాడులో పిడుగుపాటుకు కాకర్ల గుర్రప్ప అనే రైతు అక్కడికక్కడే మృతి చెందారు. పొలం పనుల కోసం వెళ్లిన ఆయన పిడుగు పడడంతో శరీరం కాలి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.
నేల కూలిన వృక్షాలు, పంటనష్టాలు
అకాల వర్షం,పెను గాలులకు వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. అరటిపంట పడిపోయింది. కలాల్లో ఉన్న వేరుశనగ, వారి ధాన్యం పంటలు తడిచిపోయాయి. జిల్లా చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. పులివెందుల పట్టణంలో సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్నిచోట్ల నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వాహనాలు దారి మళ్ళించాల్సి పరిస్థితి ఏర్పడింది. దువ్వూరు మండలంలోని గుడిపాడు, చిన్న సింగనపల్లె, గొల్లపల్లి, ముదిరే పల్లి గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడా వర్షం కురిసింది, ఈ మండలంలో నువ్వులు, వేరుశనగ, కొర్ర పంటలకు నష్టం ఏర్పడింది. చింతకొమ్మ దిన్నె మండలంలో వృక్షాలు కూలి పోయాయి. తెలుగు గంగ కాలనీ సముదాయంలో విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. అంగడి వీధిలో చెట్లు రేకుల షెడ్డుపై పడి షాపు యజమానికి తీవ్ర నష్టం ఏర్పడింది. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చాపాడు మండలంలో ఎండబెట్టిన వేరుశనగ కాయలు, వరి ధాన్యం అకాల వర్షంతో తడిసిపోయాయి. పులివెందుల మండలం కొత్తపల్లి, నడింపల్లి, నల్లవాండ్లవారిపల్లెల్లో పెనుగాలికి పంట నష్టాలు జరిగాయి. అరటి పంట నేల కూలింది.
ఆదివారం సాయంత్రం మైదుకూరు, దువ్వూరు, కాజీపేట, కలసపాడు, కాశినాయన పులివెందుల కడప, చింతకొమ్మదిన్నె, ఈ కోడూరు, బి మఠంమండలంలో అకాల వర్షం కుమ్మేసింది. అరగంట పాటు కురిసిన వర్షానికి రోడ్లు , డ్రైనేజీల్లో నీరు పారింది. వర్షాలు, మెరుపులుతో పాటు పిడుగులు పడంతో కొద్దిసేపు వర్షం బీభత్సాన్ని సృష్టించింది.