ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం-డిప్యూటీ సీఎం

by Jakkula Mamatha |   ( Updated:2024-02-23 14:34:24.0  )
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం-డిప్యూటీ సీఎం
X

దిశ ప్రతినిధి, కడప: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఎటువంటి అవినీతి లేకుండా పేదలందరికి సంక్షేమ ఫలాలు అందించడమే జగనన్న ప్రభుత్వం సంక్షేమ పాలనకు ప్రత్యక్ష నిదర్శనం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి. అంజాద్ బాషా అన్నారు. శుక్రవారం 'గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో’ భాగంగా 4 వ డివిజన్ ఇన్ చార్జ్ ఆర్.వి.రమణ ఆధ్వర్యంలో ఆర్.కె.నగర్ ప్రాంతంలో పలు వీధులను, నివాసాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా కు 4 వ డివిజన్ ప్రజలు, అభిమానులు, నగర ప్రజానీకం, మహిళలు పూలమాలలతో, బాణసంచాతో ఘనంగా, పెద్ద ఎత్తున ఊరేగింపుతో సాదర స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు చేరుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఇంచార్జీ, నాయకులు, అధికారులతో కలిసి.. ఆయా వీధుల్లో నివాసాలన్నింటినీ తిరిగారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించి, వార్డు లోని అన్ని ఇళ్లకు తిరుగుతూ కుటుంబాలను కలుసుకోవడం తో పాటు, వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి సంతకం చేసిన బుక్ లెట్‌ను అంద‌జేశారు.ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబం లబ్ధి చేకూరిందని ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేయగా పలువురు తమ సమస్యలను అంజాద్ బాషా దృష్టికి తీసుకు వచ్చారు .వెంటనే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక 4వ డివిజన్ ఇంచార్జి ఆర్.వి. రమణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఇబ్రహీం మియా, నాయకులు నారపురెడ్డి సుబ్బారెడ్డి, తోట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed