Ap News: నలుగురు స్మగ్లర్ల అరెస్ట్.. 23 ఎర్రచందనం దుంగల పట్టివేత

by srinivas |   ( Updated:2023-02-27 14:16:58.0  )
Ap News: నలుగురు స్మగ్లర్ల అరెస్ట్.. 23 ఎర్రచందనం దుంగల పట్టివేత
X

దిశ,కడప: అన్నమయ్య జిల్లా సానిపాయ, బాలపల్లి రేంజి ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూంబింగ్ చేపట్టారు. నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి 23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సోమలరాజు మహేశ్వరరాజు (37), గొల్ల అశోక్ కుమార్ (32), మోదెం లక్ష్మీకాంత్ (24), చోళరాజు వెంకటరాజు (67)లుగా గుర్తించారు.

కాగా సానిపాయ రేంజి సుండుపల్లి వద్ద అనుంపల్లి, సీతమ్మపేట మెయిన్ రోడ్డు సమీపంలో కొందరు వ్యక్తులు తచ్చాడుతూ కనిపించారు. దీంతో వారిని విచారించగా 12 ఎర్రచందనం దుంగలు లభించాయి. బాలపల్లి రేంజి పులికి మండల అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకెళ్తూ కనిపించారు. వారిని చుట్టుముట్టే లోపు దుంగలను పడేసి చీకట్లో పారిపోయారు. అక్కడ 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రెండు ఘటనలపై తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ రూ.48 లక్షలుంటుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed