- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీరు నిల్వ ఉంచొద్దు.. Kadapa ప్రజలకు అలర్ట్
దిశ, కడప: వైయస్సార్ జిల్లాలో డెంగ్యూ మహమ్మారి వ్యాప్తి చెందుతోంది. వర్షాల సీజన్ మొదలవ్వడంతో దోమల వ్యాప్తి పెరుగుతోంది. దీంతో మలేరియా, డెంగ్యూ జ్వరాలు ప్రారంభం అయ్యాయి. ఇంటి పరిసరాలను పరిశుభ్రం ఉంచుకోవడంతో పాటు మురుగు, వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలన్నారు. ఈ ఏడాది కేసులు నమోదు తక్కువగా ఉన్నా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
‘కడప మృత్యుంజయకుంట, బుగ్గవంక పరివాహాక ప్రాంతాలైన సాయిపేట, నకాష్ , రవీంద్రనగర్ తదితర లోతట్టు ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పారిశుద్ద్యం లోపం వల్ల దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంది. సాయంత్రం అయితేనే దోమలు విజృంభిస్తున్నాయి. పారిశుద్ద్యం లోపం ఉన్న ప్రాంతాల్లో దోమలు వ్యాప్తి అధికంగా ఉంటోంది. తద్వారా డెంగ్యూ, మలేరియా జ్వరాల బారిన పడుతున్నారు. దోమలు నిల్వ ఉంచిన మంచినీటి తొట్లు, పశువుల తొట్లు, డ్రమ్ములు, ఓవర్ హెడ్ ట్యాంకులు, ఎయిర్ కూలర్లు, ప్లవర్ వాజ్‌లు, పూలకుండీలు, వాడి పడవేసిన కొబ్బరి బొండాలు, పాత టైర్లు తదితర వాటిల్లో గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేసుకుంటాయి. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలి.’ అని వైద్యాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మూడేళ్ళలో 725 కేసులు
జిల్లాలో గత మూడు సంవత్సరాల్లో 725 డెంగ్యూ కేసుల నమోదయ్యాయి. వీటిలో 2021లో 90, 2022లో 391, 2023లో 244 కేసులు నమోదు అయ్యాయి. డెంగ్యూ కారణంగా మృతి చెందిన సంఘటనలు లేక పోవడంతో జిల్లా వైద్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు.