- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kadapa: జిల్లా వ్యాప్తంగా 12876 కేసుల పరిష్కారం
దిశ, కడప: ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా 12876 కేసులు పరిష్కారం కాగా రూ 2,36,42,291 కోట్ల రూపాయలు కక్షిదారులకు పరిష్కరించబడినట్లు కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస ఆంజనేయ మూర్తి తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 22 బెంచీలు ఏర్పాటు చేయడం జరిగినది. కడప నందు 5, ప్రొద్దుటూరు నందు 3, రాయచోటి నందు 3, రాజంపేట నందు 1, బద్వేల్ నందు 2, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, లక్కిరెడ్డిపల్లి, మైదుకూరు, సిద్ధవటం, నందలూరు, రైల్వేకోడూరు నందు ఒక్కొక్క బెంచిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి సీ.ఎన్.మూర్తి, నాలుగవ అదనపు జిల్లా న్యాయమూర్తి గీతా, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ప్రసూన, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ భార్గవి, బార్ ప్రెసిడెంట్ రాఘవరెడ్డి, న్యాయవాదులు కక్షిదారులు పాల్గొన్నారు.