బద్వేలు వైసీపీలో రగడ... ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నేతల తీర్మానం

by srinivas |
బద్వేలు వైసీపీలో రగడ... ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నేతల తీర్మానం
X

దిశ, కడప ప్రతినిధి: బద్వేల్ వైసీపీ టికెట్ రగడగా మారింది. ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీగోవిందరెడ్డిపై సొంత నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే‌కు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నాయకులు విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు, జడ్పిటిసిలు, మాజీ మండల అధ్యక్షులు, మాజీ జడ్పిటిసిలు, మండల స్థాయి నాయకులు, 24 మంది సర్పంచులు, 20 మంది ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు వైఎస్ఆర్సిపి నాయకులు సమావేశం నిర్వహించారు. బద్వేలు అభ్యర్థిగా డాక్టర్ సుధాకు టికెట్ కేటాయిస్తే సహకరించమని తేల్చి చెప్పారు. అటు నియోజకవర్గానికి నాయకత్వం వహిస్తున్న ఎమ్మెల్సీ గోవిందరెడ్డిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అనుచరులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు. 14 సంవత్సరాల నుండి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి నిర్వాకంతో తాము రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా చెప్పలేనంత ఇబ్బందులు పడ్డామన్నారు. డాక్టర్ సుధా ఎమ్మెల్యే అయిన తర్వాత తమకు, కార్యకర్తలకు బాధలు మరింత పెరిగాయని ఆరోపించారు. ఆమె ఎమ్మెల్సీ మాటకే కట్టుబడుతూ తమను పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఎమ్మెల్యే టికెట్ సుధాకి ఇస్తే తాము అందరం అందుకు అనుకూలంగా ప నిచేయలేమన్నారు. ఆమోదయోగ్యమైన వ్యక్తిని ప్రకటించకపోతే కార్యకర్తల ఆలోచన మేరకు తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed