- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీకి బిగ్ షాక్.. వాసిరెడ్డి పద్మ రాజీనామా
దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆమె సీఎం జగన్‌కు పంపారు. వచ్చే ఎన్నికల్లో తనకుగాని, తన భర్తకు గాని టికెట్ ఇవ్వాలని సీఎం జగన్‌ను వాసిరెడ్డి పద్మ కోరారు. అయితే సీఎం జగన్ నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడతో ఆమె మనస్థాపం చెందినట్లు తెలుస్తోంది. దీంతో పదవికి రాజీనామా చేశారు. పార్టీలో కార్యకర్తగానే పని చేస్తానని వాసిరెడ్డి పద్మ లేఖలో పేర్కొన్నారు.
కాగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఆమె 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రాజకీయాల్లోకి రావడంతోనే ఆమెను ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధిగా పని చేశారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో ఆమె 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడు కూడా అధికార ప్రతినిధిగానే పని చేశారు. 2019లో వైఎస్ అధికారంలోకి రావడంతో ఆమెను సీఎం జగన్ మహిళ కమిషన్ చైర్ పర్సన్‌ను చేశారు. అప్పటి నుంచి ఆ పదవిలో కొనసాగిన వాసిరెడ్డి పద్మ.. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరిగిన అఘాత్యాలు, దాడులు, దూషణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ప్రతి పక్ష పార్టీ నేతలకు ఆమె నోటీసులు జారీ చేశారు. వార్డు వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలపై వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేశారు. తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ హాజరుకాకపోవడంతో కేసులు నమోదు చేయాలని పోలీసులకు వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు.
Read More..