- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ ప్రభుత్వంపై YS షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ఊహించని రేంజ్‌లో సీరియస్
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకురాలు YS షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావడంలో పాలకులు ఘోరంగా విఫలం చెందారని విమర్శించారు. భూతద్దంలో వెతికి చూసినా ఏపీలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు.
కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే కనిపిస్తున్నాయని ఎవరూ ఊహించని రేంజ్‌లో షర్మిల సీరియస్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీని చూసి వైసీపీ ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. ముఖ్యమంత్రి ఒక నియంతలా పాలిస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.