- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
YS Sharmila:సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ..!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో గత నాలుగైదు రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే భారీ వర్షాల కారణంగా రహదారులు, పంట పొలాలను వరద నీరు ముంచెత్తింది. పలు చోట్ల వరద నీటితో మునిగిపోయిన పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఇటీవల భారీ వర్షాల కారణంగా పంట పొలాలు వరద నీటిలో మునిగి బాధపడుతున్న రైతులను ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పరామర్శించారు. నిన్న రైతుల దగ్గరకు వెళ్లి పంట పొలాలను పరిశీలించారు. ఈ క్రమంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి వారిని ఆదుకోవాలని వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. కోస్తా జిల్లాల్లో వర్షాలు, వరదలతో రైతులు అతలాకుతలం అయ్యారని తెలిపారు. కాలం చెల్లిన, అస్తవ్యస్తంగా మారిన కాలువల నిర్వహణ కారణంగా పంట పొలాలు నీట మునిగాయని, తీవ్ర స్థాయిలో పంట నష్టం జరిగిందని షర్మిల వివరించారు.
ఈ క్రమంలో రైతుల కష్టాలను రాష్ట్ర ఎమర్జెన్సీగా ప్రకటించండని ఆమె కోరారు. కాలువల నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే పంట పొలాలు మునకకు దారితీసింది. గత ప్రభుత్వం కాలువల నిర్వహణను విస్మరించింది. కాలువల మరమ్మతులకు ఉద్దేశించిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని మండిపడ్డారు. వెంటనే కాలువల మరమ్మతులకు నిధులు కేటాయించాలని మీ ప్రభుత్వాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతులకు ధాన్యం సేకరణ బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేసింది. ఇప్పుడు వర్షాలు, వరదలతో సతమతమవుతున్న ఆ రైతులకు బకాయిలు కూడా చెల్లించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని వైఎస్ షర్మిల తన లేఖలో పేర్కొన్నారు.
AP News:‘ఏపీకి పెట్టుబడులు రాకుండా జగన్ కుట్ర’..హోం మంత్రి ఆగ్రహం