- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రధాని మోడీకి వైఎస్ షర్మిల లేఖ.. ఎందుకంటే?
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మంగళవారం లేఖ రాశారు.ఆంధ్రప్రదేశ్ లోని 5.5 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ కాంగ్రెస్ పార్టీ, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లో పేర్కొన్న హామీలను పరిష్కరించాలని ప్రధానిని ఆమె కోరారు. అలాగే బడ్జెట్ సమావేశాల సందర్భంగా రేపు రాష్ట్రపతి ప్రసంగంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ అంశాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు.
హామీల అమలులో ప్రభుత్వాలు విఫలం
హామీల అమలులో ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపారు. దశాబ్దం తర్వాత కూడా విభజన హామీలు అమలు కాలేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగానే మిగిలిందని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల వాగ్దానాలను అమలు పరచలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీల కోసం తమ నిబద్ధత, పోరాటం అవిశ్రాంతంగా కొనసాగిస్తూనే ఉంటామని వివరించారు.